2006 లో వచ్చిన హైదరాబాద్ లో వచ్చిన హైదరాబాద్ నబాబ్ సినిమాకు సీక్వెల్ హైదరాబాద్ నవాబ్ 2 జులై 19న విడుదల కానుంది. ఆర్.కె నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. 

నిర్మాత, దర్శకుడు ఆర్.కె మాట్లాడుతూ...
రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాయడం జరిగింది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రెండు గంటలు ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హీరోలు, హీరోయిన్స్ అందరూ బాగా నటించారు. చక్కని పాటలు ఉన్నాయి. జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. హైదరాబాద్ లోకల్ కల్చర్ ను బేస్ చేసుకొని తీసాం. మీ అందరి సపోర్ట్ కావాలి.

హీరో అలీ రజీత్ మాట్లాడుతూ...

'2006 లో హైదరాబాద్ నవాబ్ చూసాను, బాగా నచ్చింది.  ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో నటించడానికి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ధ్రువ సినిమాలో చిన్న పాత్ర చేసాను అలాగే సీరియల్స్ లో నటించాను. హైదరాబాద్ నవాబ్2 మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను' అన్నారు.

హీరో అజీజ్ మాట్లాడుతూ...

స్క్రిప్ ఈ సినిమాకు హీరో. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కామెడీ ఈ సినిమాలో మెయిన్ హైలెట్. సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. జులై 19న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్న అన్నారు

హీరోయిన్ ఫరా ఖాన్ మాట్లాడుతూ...
 'నాకు ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆర్.కె గారికి ధన్యవాదాలు. హైదరాబాదీ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాను. టీమ్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్న' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: