Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:26 pm IST

Menu &Sections

Search

ఇస్మార్ట్ శంకర్.... స్ఫూర్తి మాత్రమే

ఇస్మార్ట్ శంకర్.... స్ఫూర్తి మాత్రమే
ఇస్మార్ట్ శంకర్.... స్ఫూర్తి మాత్రమే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్క డైలాగ్ తోనే హీరోకి స్టార్ డమ్ తెప్పించగల దర్శకుడు పూరి జగన్నాథ్. తన సినిమాలో హీరోలు ఎంత రాష్ గా ఉంటారో వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి. హీరో సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా తీసే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్క నటుడుకి ఉంటుంది. ఆయన సినిమాల ద్వారా స్టార్స్ అయిన హీరోలు చాలా మందే ఉన్నారు. మహేష్ బాబు కెరీర్లో పోకిరి ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.

అయితే ఈ డాషింగ్ డైరెక్టర్ గత కొన్ని రోజులుగా విజయం కోసం వేచి చూస్తున్నాడు. టెంపర్ తర్వాత వరుసగా ఫ్లాపుల బాట పట్టాడు. అయినప్పటికీ ఈ డైరెక్టర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పూరి జగన్నాథ్ సినిమా అనగానే ఓపెనింగ్స్ వచ్చేస్తుంటాయి. ఈ డాషింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు పూరి జగన్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18 న రిలీజ్ అవుతుంది.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాఫ్ట్ క్యారెక్టర్లు చేసిన రామ్ కి మాస్ మసాలా సినిమాలు తీసే పూరికి ఎలా కలిసిందని ఆశ్చర్యపోయారు. సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఇది మరింత ఎక్కువైంది. ట్రైలర్ లో రామ్ పూర్తిగా డిఫరెంట్ గా కనబడ్డాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రామ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభించడంతో సినిమా విజయం మీద ఆశలు పెట్టుకున్నారు చిత్ర బృందం.

అయితే ఈ సినిమాలో రామ్ కి తలలో ఒక చిప్ పెడ్తారట. ఇది తెలిసిన చాలా మంది ఇస్మార్ట్ శంకర్ సినిమా హాలీవుడ్ సినిమాకి కాపీ అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వివాదంపై దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించాడు. ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా తీసుకుని తీసిందే తప్ప కాపీ కొట్టలేదని చెప్పాడు. తలలో చిప్ పెట్టడం అనే కాన్సెప్ట్ ని తీసుకున్నామని, కాపీ కొట్టలేదని చెప్పుకొచ్చాడు.


ismart-shankar
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING