టాలీవుడ్ లో లక్ష్మిరాయ్ కి అడపా దడపా సినిమాలు పడుతూనే ఉన్నాయి. చిరంజీవి తో ఖైదీ నెం:150, పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో, బాలుపులో రవితేజతో ఐటెం సాంగులతో మెరిసింది. అధినాయకుడు సినిమాలో బాలకృష్ణ తో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి సినిమాలో నటించింది.

 

పర్ఫెక్ట్ ఫిగర్ గా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే లక్ష్మిరాయ్ ఇటీవల కాస్త ఒళ్ళు చేసింది. గ్లామర్ కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చే తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఎంత గ్లామర్ గా ఉంటే అంతగా చూస్తారు. అందుకే ఈ ముద్దుగుమ్మ ఎక్స్ ర్సైజులు, డైట్లు పాటించి ఒళ్ళు తగ్గించి నాజూకుగా తయారయింది. అమ్మడు స్లిమ్ అవటమే ఆలస్యం తన ట్విట్టర్ లో బికినీలో ఉన్న పిక్ ను పోస్ట్ చేసింది. బ్లూ కలర్ బికినీ లో పర్ఫెక్ట్ ఫిగర్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన స్టిల్ యూత్ ని గిలిగింతలుపెట్టేస్తోంది.

 

"బికినీ షేప్ కు తగ్గట్టు నా బాడీని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. నా శరీరాకృతిలో వచ్చిన మార్పులతో నాకు నేనే నచ్చలేదు. అందుకే నేను ఉండాలనుకున్న షేప్ లోకి వచ్చేసాను. ఇపుడెంతో ఆనందంగా ఉంది" అని తన వాల్ లో రాసుకుంది. పాప బికినీ పోస్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సూపర్ ఫిగర్, నమ్మలేకుండా ఉన్నాం, యు ఆర్ క్వీన్.. అంటూ ముద్దుగుమ్మపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: