తెలుగులో వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయగా..సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం బిగ్ బాస్ 3 సీజన్ బుల్లితెరపై రాబోతుంది. ఈ రియాల్టీ షోకి అక్కినేని నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇక 100 రోజులు 14 మంది ఇంటి సభ్యులతో బిగ్ బాస్ రన్ అవబోతుందని సమాచారం. 

అయితే బిగ్ బాస్ ఇంకా రాకముందు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది.  రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో బిగ్ బాస్ యాజమాన్యంపై నటి గాయత్రి, యాంకర్ శ్వేతారెడ్డి కేసులు వేశారు.  దాంతో అసలు బిగ్ బాస్ 3 వస్తుందా రాదా అన్న అనుమానాలు తెలుగు ప్రేక్షకులకు వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది.

రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా, ఈ అంశంపై వారం రోజుల లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది.  శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నిర్వాహకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ వారిద్దరూ సంచలన ఆరోపణలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: