టాలీవుడ్ లో ఈ మద్య కొత్త దర్శకులు మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తూ సూపర్ హిట్ అందుకుంటున్నారు.  అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కొత్త దర్శకలు తీసినవి కావడం విశేషం.  తాజాగా  కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన 'దొరసాని' సినిమాకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.  దర్శకుడిగా కేవీఆర్ మహేంద్రకి మంచి పేరు తీసుకొచ్చింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో  కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ..ఇండస్ట్రీలోకి రాకముందు నేను చాలా ఇబ్బందులు పడ్డానని..ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు.

గతంలో  నేను ఒక సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేశాను. కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరున్న ఒక ఆర్టిస్టు ఆ సినిమాలో హీరోగా చేస్తున్నాడు.  దర్శకుడి సూచన మేరకు నేను ఆ హీరోకి సీన్ చేసి చూపించాను. దాంతో నువ్వు నాకు యాక్టింగ్ గురించి చెబుతున్నావా..? అన్న విషయంపై ఆయన చాలా కోపంతో రగిలిపోయాడట.  అదే సమయంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోవడంతో అతని పాత్ర నేను వేయాల్సి వచ్చింది. 


ఆ సమయంలో ఆయన నా షర్ట్ కాలర్ పట్టుకొని కావాలని పదే పదే చేస్తూ, నా వల్లనే ఎక్కువ టేకులు అవుతున్నట్టుగా అవమానపరిచాడు. ఆయన ఎందుకు అలా చేశాడన్న విషయం అక్కడున్నవారందరికీ అర్థమైంది..దాంతో అతన్ని ఏమీ అనలేక నాలో నేనే కుమిలిపోయాను.  ఆ కసితోనే నేను డైరెక్షన్ ఫీల్డ్ పై ఎక్కువ దృష్టి పెట్టి మంచి సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: