కాజల్ అగర్వాల్... టాలీవుడ్ లో బెస్ట్ హీరోయిన్లలో ఒకరు.  లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యి.. మగధీర వంటి సినిమాతో భారీ హిట్ అందుకుంది.  ఆ తర్వాత వరసగా బడాబడా హీరోలతో సినిమాలు చేసింది.  అయితే, గత కొంతకాలంగా విజయాలు ఆమెకు దూరం అయ్యాయి.  


మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాలు విజయాలు సాధించాయి.  ఆ తరువాత హిట్ లేదు.  సీతపై అసలు పెట్టుకున్నా ఫలించలేదు.  ప్రస్తుతం కాజల్ రెండు సినిమాలు చేసింది.  అందులో ఒకటి రణరంగం కాగా రెండోది కోమలి.  


రణరంగం సినిమాలో శర్వానంద్ హీరో.  ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  కేజీఎఫ్ సినిమా మోడల్ లో ఉందని అంటున్నారు.  దీనితో పాటు కోమలి అనే మరో సినిమా చేస్తున్నది కాజల్ అగర్వాల్.  


ఈ మూవీ కూడా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇందులో జయం రవి హీరో.  కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారు.  దీనిపై కూడా అంచనాలు ఉన్నాయి.  ఈ రెండు సినిమాలు ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ అవుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: