సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో మాస్ హీరో. తాను చేసిన సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి.  ఇటీవలే ఈద్ కు వచ్చిన భారత్ మూవీ బంపర్ హిట్ అయ్యింది.  భారీ కలెక్షన్లు వసూలు చేసింది.  ప్రస్తుతం దబాంగ్ 3, ఇన్షా అల్లా సినిమాలు చేస్తున్నాడు.  


దబాంగ్ 3 సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్.  దబాంగ్ సీరీస్ లోని మొదటి రెండు సినిమాలలో కూడా సోనాక్షినే హీరోయిన్.  ఇందులో మరో హీరోయిన్ కు స్పేస్ ఉన్నది.  దీనికోసం అనేక మందిని అనుకున్నారు.  


కానీ, ఫైనల్ గా ఇందులో మహేష్ మంజ్రేకర్ కూతురు సైయి ని తీసుకున్నారట.  పదేళ్ల క్రితం మహెష్ కు సల్మాన్ ఖాన్ మాటిచ్చాడు. పెద్దయ్యాక మహేష్ కూతురిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారట.  ఆ మాటను ఇప్పుడు నిజం చేశాడు.  


తన దబాంగ్3 సినిమాలో ఓ హీరోయిన్ గా తీసుకున్నారు.  సో, సల్మాన్ మూవీద్వారా మరో కొత్త హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నది.  ప్రభుదేవా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: