ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేసి తెలుగు సినిమా వైపు అందరి ద్రుష్టి సరించేలా చేసి వందల కోట్లను అవలీలగా కొల్లగొట్టిన బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ ఏ చిత్రం చేస్తాడు అని అంత ఎదురు చూశారు .5 ఏళ్ల తరువాత ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం అయింది అంటే అది ఎలా ఉంటుందో అనేది అందరిలో అసక్తి నెలకొంది ఏదో పెద్ద డైరెక్టర్ బారి బడ్జెట్ ఇలా ఏదో ఏదో ఊహించారు .కానీ అన్ని అంచనాలు తారుమారు చేస్తూ ఓ 25 ఏళ్ళ కుర్రాడికి తన తరవాత సినిమా బాధ్యతలు అప్పగించాడు .         


అనంతపురం జిల్లాకి చెందిన ఒక్క సామాన్య కుటుంబం కి చెందిన గోపినాథ్ కుమారుడు సుజీత్ .వీరి కుటుంబం హైదరాబాద్ లోనే స్థితరపడ్డారు .సుజీత్ కి చిన్నపటినుంచి సినిమాలు అంటే పిచ్చి .తరగతి పుస్తకాల కంటే కథల పుస్తకాలే ఎక్కువ చదివేవాడు తన తోటి వారికి రకా రకాల కథలను చెప్తుండే వాడు .ఆలా స్టోరీ టెల్లింగ్ లో ఆరితేరాడు . తన ఆసక్తిని తల్లితండ్రులు సైతం ప్రోసహించడం తో చెన్నయ్ లోని ఎల్.వి.ప్రసాద్ సినిమా అకాడమి లో చేరి డైరెక్షన్ లో ఓనమాలు నేర్చుకున్నాడు .


తరవాత తన పేరు తోనే ఒక్క ఛానల్ ని తేర్చి 30 వరకు షార్ట్ ఫిలిమ్స్ తీసాడు .చివరకి రన్ రాజా రన్ కథను యూవీ క్రియేషన్స్ నిర్మాతలని కలిసి వినిపించాడు .రన్ రాజా రన్ ని అనుకున్నట్టే 4 కోట్లా రూపాయలతో శెరవేగంగా చిత్రీకరించాడు .చిత్రం విడుదల అయ్యి 12 కోట్లా కు పైగా వసూల్ చేసి పెద్ద చిత్రం గా నిలిచింది .ఆ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుల కేటగిరి లో దృశ్యం కార్తికేయ ఊహలు గుస గుసలాడే చిత్రలతో పోటీ పడి ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డు సుజీత్ గెలిచాడు .      


సాహో కథను సుజీత్ ప్రభాస్ కి బాహుబలి టైం లో చెప్పాడు .ప్రభాస్ కూడా ఓకే అన్నాడు .చేస్తే ప్రభాస్ తోనే తన నెక్స్ట్ మూవీ చేయాలి అని 3 ఏళ్ళు వేచిఉన్నాడు .బాహుబలి 2 సినిమా రిలీజ్ రోజే సాహో టీజర్ ని రిలీజ్ చేసి అభినందనలు పొందాడు . ఈ మధ్యే సాహో షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 15 వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ బద్ధలు కొట్టడానికి సిద్ధం గా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: