ఈ ఫోటో చూసి మా అమ్మానాన్నలను తిట్టకండి అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. తన చిన్నతనంలో దిగిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. అందులో  ప్యాంటూ చొక్కా గుబురు జుట్టుతో నిల్చునివున్నారు. నెటిజనలను ఉద్దేశిస్తూ వర్మ సరదా కామెంట్ చేశారు. పాఠశాల రోజుల్లో నేను దిగిన ఫోటో ఇది, మీరు మా అమ్మా నాన్నలని తిట్టకండి ఆ దుస్తుల్ని నేనే కొనుక్కున్నా అని పోస్ట్ చేశారు. 
దీనికి నెటిజన్స్ నుంచి పలు కామెంట్స్ వచ్చాయి. మీ అభిరుచి అలాంటిది కాబట్టే చిత్ర పరిశ్రమకు వచ్చారు. పూలరంగడు, కలర్ ఫొటో కాదు కాబట్టి సరిపోయింది, మరి హెయిర్ స్టైల్ విషయం ఏంటని కామెంట్స్ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: