.... అంటున్నారు నటి రాధిక ఆప్టే. ఆమె నటించిన 'ది వెడ్డింగ్‌ గెస్ట్‌' అనే హాలీవుడ్‌ సినిమాకు సంబంధించిన ఓ హాట్‌ సీన్‌ నెట్‌లో లీక్‌ అవ్వడంతో ఆమె అలా ఫైర్‌ అయ్యారు.
' బోల్డ్‌ సీన్స్‌లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రపంచ సినిమాలు చూస్తూనే పెరిగాను.. నా శరీరంతో నేను సౌకర్యంగానే ఉన్నాను. బోల్డ్‌ సీన్స్‌లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.' అని వ్యాఖ్యానించారు.

ది వెడ్డింగ్‌ గెస్ట్‌ సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని, కానీ అవన్నీ వదిలేసి కేవలం ఈ ఒక్క సెక్స్‌ సీన్‌ మాత్రమే లీక్‌ చేసారన్నారు. సమాజపు మానసిక పరిస్థితికి అద్దం పట్టే సీన్‌ ఇదేనని, సొసైటీ నిజంగానే ఓ సైకోలా మారిపోయిందన్నారు.

ఆ లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్‌పటేల్‌ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్‌ సీన్‌ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు దేవ్‌ పటేల్‌ సన్నివేశమని ప్రమోట్‌ చేయరని నిలదీశారు. ది వెడ్డింగ్‌ చిత్రాన్ని మైఖెల్‌ వింటర్‌ బాటమ్‌ తెరకెక్కిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: