భారీ బడ్జెట్ తో ప్రభాస్ కెరీర్లోనే విశిష్టత దక్కించుకున్న సాహో సినిమా గురించి వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పాపం ప్రభాస్ ఫ్యాన్స్ మరియు ప్రభాస్ కెరియర్ కూడా పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు. బాహుబలి వంటి భారీ విజయం తర్వాత అదే స్థాయిలో హిట్ కొట్టాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ నేపథ్యంలో ఉన్న కథ అయినా 'సాహో' సినిమా స్టొరీ ని ఎంచుకోవడం జరిగింది.


చాలా భాషలలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఆగస్టు 15న విడుదల అవుతుందని వార్తలు లీకులు చేసి ప్రభాస్ అభిమానులను కళ్ళు కాయలు కాచేలా చేశారు సినిమా యూనిట్. ఇదే క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మెల్లగా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ముందుగా టీజర్నివిడుదల చేసిన సినిమా యూనిట్ ఇటీవల ఒక పాటను విడుదల చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊరించారు.


ముందుగా టీజ‌ర్‌తో సంతృప్తి వ్య‌క్తం చేసిన ప్ర‌భాస్ ఫ్యాన్స్- పాట చూసి గోల పెట్టారు. ఇది హిందీ పాట‌లా ఉందంటూ.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొద‌లైపోయింది. ఇప్పుడు ఏకంగా సినిమాని 15 రోజులు పాటు వాయిదా వేశారు. వీఎఫ్ ఎక్స్ ప‌నులు ఇంకా అవ్వ‌లేద‌ని అందుకే వాయిదా...వేసినట్లు తెలపడంతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పాపం ప్రభాస్ , పాపం ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: