అనుపమ పరమేశ్వరన్. అచ్చం తెలుగింటి ఆడపిల్లగా ముద్దుగా ఉంటుంది. మన లంగా ఓణీ ఆమెకు కరెక్ట్ గా సూట్ అవుతాయి. కుటుంబ కధా చిత్రాలకు కరెక్ట్ యాప్ట్ అనుపమ. అయితే ఇప్పటి యూత్ మూవీస్ లో ఆమెకు ఆఫర్లు రాకపోవడానికి ఆమె ట్రడిషనల్ లుక్ ఓ విధంగా మైనస్ అంటున్నారు.  ఏది ఏమైనా మంచి అమ్మాయిగా అనుపమ పేరు తెచ్చుంది.


అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. తన క్యూట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, యువతకు చేరువవుతోంది.


ఈ ముద్దు గుమ్మ రామ్  పోతినేని తో తెలుగులో రెండు సినిమాలు వరసగా చేసింది. అయితే అవి ఫ్లాప్ కావడంతో  ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె తన లుక్ ని మార్చుకుంది. స్లిమ్  గా మారడమే కాకుండా తాను కూడా బోల్డ్ టైప్ యాక్టింగ్ కి రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెడుతోంది.  మరి ఆమెకు అవకాశాలు వస్తాయా. 


మరింత సమాచారం తెలుసుకోండి: