యంగ్ హీరోస్ అందరు వైవిధ్యమైన కథలు ఎక్కడ దొరుకుతాయా? అని చూస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈ మధ్యే వచ్చిన నిను వీడని నీడను నేనే, బ్రోచేవారెవరురా..వంటి సినిమాలు. కానీ యంగ్ హీరో కార్తికేయ మాత్రం మళ్లీ ఓ రొటీన్ సినిమానే  ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ, తరువాత హిప్పీ అనే సినిమా ట్రయ్ చేసాడు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా గుణ 369 అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమాని కంప్లీట్ చేశాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

కానీ టైటిల్ కు వున్న వైవిధ్యం మాత్రం ట్రైలర్ లో అంతగా కనిపించలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ, ప్రేమ, విలన్, కాపాడుకోవడం వంటి రొటీన్ లైన్ ఈ సినిమా ట్రైలర్ లో కనిపిస్తోంది. దానికి తగినట్లే సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించడం లేదు. హాయిగా సాగిపోయే లైఫ్, ప్రేమ, అంతలో అనుకోని పరిణామాలు, ఆ తర్వాత యాక్షన్ టర్న్ తీసుకునే సినిమా ఈ లైన్ లోనే ట్రైలర్‌ను కట్ చేసారు. 

కార్తికేయ రెగ్యులర్ సీన్ల కన్నా, యాక్షన్ సీన్లలో బాగా నటించినట్లు కనిపిస్తోంది. యంగ్ హీరో నటించిన ఈ రొటీన్ యాక్షన్ సినిమాను జనం వచ్చేనెల 2న చూడబోతున్నారు. అర్జున్ జంధ్యాల మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించారు. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ హిట్ కొడతాడో లేక ఫ్లాప్ ను చూసి సర్ధుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: