ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా సాహో దాదాపు వాయిదా పడిపోయినట్లే అని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం ఈ సినిమా ఒకటి రెండు వారాలు వెనక్కు జరిగినట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ పనులు ఎక్కువగా వుండే సినిమాలకు ఇదే సమస్య. గతంలో కూడా కొన్ని సినిమాలకు ఇదే సమస్య వచ్చింది. సాహో సినిమా పూర్తిగా విఎఫ్ఎక్స్ పనులతో ముడిపడి వున్న సినిమా. ఇలాంటి సినిమా అనుకున్న టైమ్ కు రావడం అంటే అద్భుతమే. బాహుబలి సినిమా కూడా ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంది.

సాహోకి కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయి. కాకపోతే, సాహో ముందుగా ఆగస్టు 15న అని అన్ని విధాలా ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఆ సినిమా వెనక్కు వెళ్తుంది అంటే ఎవ్వరూ ఊహించలేదు..నమ్మలేదు. కానీ దాదాపు వారం రోజులుగా ఈ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడుతున్నాయి. కానీ సాహో యూనిట్ మాత్రం విడుదల 15న పక్కా అంటూ వచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, సాహోలో ఏం జరుగుతోంది అన్నది యూనిట్ లో ఒకరిద్దరు కీలక వ్యక్తులకు తప్ప వేరేవారికి తెలియదు. అందువల్ల ఏదో జరుగుతోంది అని టాక్ తప్ప, ఏం జరుగుతోంది అన్నది క్లారిటీగా తెలియదు. 

ఇలాంటి నేపథ్యంలో వాయిదా వార్త బయటకు వచ్చి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికీ సాహో యూనిట్ అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. సాహోను ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా విదేశాల్లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇదిలా వుంటే సాహోకి సంబంధించి సరైనా అప్‌డేట్ లేకపోవడంతో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసే అవకాశం వుంది. ఒకటి పక్కన మరొకటి చేరిస్తే తప్ప, కొత్త వార్త పుట్టదు అనుకునే జనాలు కూడా వుంటారు. అలాంటి వ్యవహారాలు అన్నీ కలిసి సాహో పై గ్యాసిప్ లు గంపల కొద్దీ పుట్టించక ముందే అధికారికంగా ప్రకటిస్తే బెటరని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో సాహో బృందం ఏం  చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: