ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో సావిత్రి, సౌందర్యలా.. కేవలం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తానని హీరోయిన్లు అంటే కుదరదని తెలుస్తూనే ఉంది. ఎంతో కొంత గ్లామర్ షోకు ఒప్పుకుంటేనే అవకాశాలు వస్తాయి. కానీ ఫిదా ఫేం సాయి పల్లవి మాత్రం తన రూటే సెపరేటు అంటోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన రౌడీ బేబీ పాటలో ఇంచు నడుము కూడా కనిపించకుండా కేవలం తన స్టెప్పులతో ఉర్రూతలూగించడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమని చెప్పాలి. 

అయితే కెరీర్ మొదట్లో ఉన్నంత సక్సెస్ ఇప్పుడు  సాయి పల్లవికి లేదనే చెప్పాలి. రీసెంట్‌గా వచ్చిన సూర్య ఎన్జికె పాత్ర గురించి ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఓ మాములు రోల్ ని ఎలా ఒప్పుకున్నావని అభిమానులే నిలదీశారు. నిజానికి సాయి పల్లవికి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పటికీ కేవలం తను పెట్టుకున్న స్ట్రాంగ్ లిమిటేషన్స్ వల్లే అవి మిస్ అవుతున్నాయని ఇన్ సైడ్ టాక్. డియర్ కామ్రేడ్ లో ముందు అనుకున్న ఛాయస్ సాయిపల్లవేనట. కానీ కథ ప్రకారం లిప్ లాక్స్ ఉంటాయని దర్శకుడు భరత్ కమ్మ చెప్పడంతో నో చెప్పారని టాక్.

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు ముందు అనుకున్న పేరు కూడా సాయి పల్లవి. ఈ రెండు రష్మిక మందన్నతో రీ ప్లేస్ అయ్యాయి. దీనికి కారణం మాత్రం బయటికి రాలేదు. సౌందర్య టైంలో ఇలాగే ఉండేవారు కానీ ఆఫర్స్ తగ్గాక అన్నయ్య-నరసింహ సినిమాల్లో తనలోని గ్లామర్ యాంగిల్ ను చూపించారు. మరి సాయి పల్లవి స్టాండ్ మార్చుకుంటుందా లేక సినిమాలు వచ్చినా రాకపోయినా నా రూట్ ఇంతే అంటుందా లేదా అన్నది కొంత కాలం ఆగితే తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: