1996 లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ డైరక్షన్, రెహమాన్ మ్యూజిక్.. అన్నీ కలగలిపి సినిమాను బ్లాక్ బస్టర్ ను చేశాయి. దేశంలో పాతుకుపోయిన అవినీతిని కళ్లకు కట్టినట్టు చూపిన శంకర్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. కమల్ యాక్టింగ్ స్కిల్స్ కు ఆకాశమే హద్దుగా అయింది.

 

 23 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని శంకర్ భావించి భారతీయుడు-2 టైటిల్ తో కథ సమకూర్చుకున్నాడు. హీరోగా కమల్ నే మళ్లీ ఈ సినిమాలో ఎంచుకున్నాడు. అయితే.. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని అవాంతరాలతో ఆగిపోయింది. బడ్జెట్ విషయంలో లైకా ప్రొడక్షన్స్, వారికి శంకర్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, సినిమా ఉండకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. కాజల్ మెయిన్ హీరోయిన్ కాగా, ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్ గా, హీరో సిద్ధార్డ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

 

భారతీయుడు మొదటి వెర్షన్ వచ్చి రెండు దశాబ్దాలు దాటిని ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ ఎవరూ మరచిపోలేదు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే కమల్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా మంచి స్టోరీ లైన్ తో శంకర్ తన మునుపటి ఫామ్ ను చూపేందుకు సిద్దంగా ఉన్నాడని కోలీవుడ్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: