స్వామి రారా, కేశవ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి సుధీర్ వర్మ ఇపుడు తెలుగులో శర్వానంద్ హీరోగా రణరంగం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా కాజల్ నటిస్తున్నది..ఈ సినిమా ఆగష్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా తమిళ్ లో జయం రవి హీరోగా కోమలి సినిమా చేస్తున్నది. ఆగష్టు 15 న విడుదలవుతున్న ఈ సినిమాపై తమిళంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు , తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కాజల్ నటించిన రెండు సినిమాలు, రెండు భాషల సినిమాలు ఒకే రోజు విడుదలవడం విశేషం. ఇందులో ఏ సినిమా హిట్ అయినా కాజల్ అగ్రకథానాయికగా కొంతకాలం కొనసాగగలదని సినీ వర్గాల వారి అంచనా.. కాజల్ కోరిక కూడా....
ఇకపోతే ఈమధ్య కాలంలో కాజల్ నటించిన చిత్రం సీత. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 24న విడుదలయింది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో జతకట్టింది. కాజల్ తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఎందుకో ఆ చిత్రం ఆశించినంత హిట్ కాలేకపోయింది. తిరిగి మళ్ళీ శర్వా తోచేసే చిత్రం మంచి హిట్ రావాలని కోరుకుందాం.