నాని సహజ నటుడు.  అందుకు సందేహం లేదు.  అయన ప్రతి సినిమా చాలా న్యాచురల్ గా ఉంటుంది.  ఈ హీరో నటించిన జెర్సీ సినిమా సూపర్ హిట్టైంది.  క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ అందరిని ఆకట్టుకుంది.    ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబుతున్న సంగతి తెలిసిందే.  షాహిద్ కపూర్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.  దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


జెర్సీ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారు.  దీనిని తమిళ్ లో రానా ప్రొడ్యూస్ చేస్తున్నారు.  విష్ణు విశాల్ ఈ సినిమాలో నాని రోల్ చేస్తున్నారు.  త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి.  ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రానా అనేక చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహారిస్తుండటం విశేషం.  


క్షణం సినిమా దర్శకుడితో రానా సినిమా చేస్తున్నారు.  ఇందులో శ్రద్ధా శ్రీనాధ్, సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో నటిస్తున్నారు.  ఇక సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వచ్చిన ఓ బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు.  దీనికి రానా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఓ బేబీ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తే... బాలీవుడ్ లో సమంత ప్లేస్ లో అలియా భట్ హీరోయిన్ గా చేస్తున్నారు.  ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: