ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జూనియర్ ల మధ్య అత్యంత సాన్నిహిత్యం కొనసాగుతోంది. తన అన్న కోసం జూనియర్ మంచి కథలు దర్శకులు తన దృష్టికి వచ్చిన వెంటనే కళ్యాణ్ రామ్ కు రిఫర్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కళ్యాణ్ రామ్ చేయబోతున్న మరొక సాహసం జూనియర్ ను ఖంగారు పెడుతున్నట్లు టాక్. 

గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ మూవీ ఒక ట్రెండ్ సెటర్.  ఫాంటసీ జానర్ లో వచ్చిన ఆమూవీకి రాజమౌళి దర్శకత్వం తారక్ నటన ఆమూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చింది. ఇప్పుడు ఇలాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ పై కళ్యాణ్ రామ్ దృష్టి పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇది యముడు చుట్టూ తిరిగే కథ కాదు. దేవలోకాలు భూమిని కనెక్ట్ చేస్తూ ఓ కొత్త లైన్ ని డెబ్యూ డైరెక్టర్ ఒకరు ఈమధ్యనే కళ్యాణ్ రామ్ కు చెప్పడంతో ఆ సబ్జెక్ట్ విపరీతంగా నచ్చడంతో ఆమూవీని తానే నిర్మిస్తాను అంటూ కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమూవీకి కథ రీత్యా చాల భారీ బడ్జెట్ అవుతుంది. దీనితో ఈమూవీ కథ దెబ్బ తినకుండా బడ్జెట్ తగ్గించే మార్గాల గురించి కళ్యాణ్ రామ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. 

గతంలో ఇలాగే భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ తీసిన ‘ఓమ్’ ‘కిక్ 2’ లాంటి భారీ సినిమాలు ఫ్లాప్ కావడంతో భారీగా నష్టపోయాడు ఈ నందమూరి హీరో. అయితే అదృష్టం కలిసి వచ్చి ‘పటాస్’ నుండి ఈ హీరో కోలుకున్నా ఇంకా పూర్తిగా నిలతోక్కుకోలేకపోతున్నాడు. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘118’ కూడ ఒక మోస్తరు విజయం సాధించింది. ఇలాంటి పరిస్థుతులలో మళ్ళీ భారీ సినిమాలకు నిర్మాతగా మారితే కళ్యాణ్ రామ్ కు చిక్కులు వస్తాయి అన్న ఉద్దేశ్యంతో కొందరు నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు ఇలాంటి సాహసాలు చేయకుండా కళ్యాణ్ రామ్ ను కట్టడి చేసి కేవలం బయట సినిమాలు మాత్రమే నటించేలా చూసుకోమని కళ్యాణ్ రామ్ గురించి జూనియర్ తో రాయబారాలు చేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: