యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్.... నిధి అగర్వాల్, నభా నటేష్ కాంబినేషన్ లో మొట్టమొదటిసారి టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరెక్కిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ద‌ర్శ‌కుడు పూరి ఇప్ప‌టికే ఆరు వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో పాటు మ‌రోవైపు హీరో రామ్‌కు కూడా మూడేళ్లుగా హిట్ లేక‌పోవ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.


పూరి తాను పూర్తిగా మారిపోయాన‌ని చెప్పి ఈ సినిమా తీశారు. చార్మీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమా గురువారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టికే ఫ‌స్టాఫ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టాక్ చూస్తే యావ‌రేజ్‌గా ఉంద‌నిపిస్తోన్న‌ట్టు చెపుతున్నారు. సినిమా ఆరంభంలోనే కొంత మంది శాస్త్రవేత్తల మీటింగ్ ద్వారా కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్ తో మొదలు పెట్టిన పూరి ఆ త‌ర్వాత పాత్ర‌ల‌న్నింటిని ఫ‌స్టాఫ్‌లోనే రివీల్ చేశాడు.


అయితే పూరి గ‌త సినిమాల్లాగానే హ‌డావిడిగా చుట్టేసిన‌ట్టే క‌న‌పిస్తోంది. సినిమా టేకింగ్ లో ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది.మణిశర్మ అందించిన మాస్ బీట్ సాంగ్స్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. సినిమా ముందుకు వెళుతున్నా క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా లేదు. ఇక పూరి స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించదు మరి సెకండాఫ్ అయినా సినిమాకు కీలకంగా మారుతుందో లేదో చూడాలి. సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే పూరి, రామ్ ఖాతాలో మ‌రో ప్లాప్ ప‌డిన‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: