రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా కోసం రామ్ తో పాటు పూరి జగన్నాథ్, హీరోయిన్లు కూడా చాలా వెయిట్ చేశారు.  దానికి కారణం ఉంది.  అదేమంటే... రామ్,పూరి, నిధి అగర్వాల్, మణిశర్మకు ఈ సినిమా చాలా కీలకం.  


ఈ నలుగురికి హిట్ చాలా అవసరం.  ముఖ్యంగా పూరికి.  ఈ సినిమా హిట్టయితే పూరికి సినిమాలు వస్తాయి.  బాలయ్యతో సినిమా చేయాల్సి ఉన్నది.  ఆ సినిమా చేయాలా వద్దా అన్నది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉన్నది.  మణిశర్మ కు కూడా ఇది కీలకం.  


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి.  ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ముగిశాయి.  అక్కడి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.  పక్కా మాస్ యాక్షన్ తో రామ్ ఆకట్టుకున్నాడని టాక్ వస్తోంది.  రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు.  


ఎనర్జిటిక్ తో పాటు రామ్ తెలంగాణ యాసతో మెప్పించారని తెలుస్తోంది.  పూరి ఈజ్ బ్యాక్ అన్నట్టుగా సినిమా ఉందని, నిధి  అగర్వాల్, నభా నటేష్ అందంతో మెప్పించారట.  ముఖ్యంగా నిధి అగర్వాల్ బీచ్ సాంగ్ బాగుందని, మణిశర్మ మెలోడీ ఆకట్టుకుందని టాక్ వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: