ఒక రియాలిటీ షో గురించి ఆ షోను హోస్ట్ చేసే సెలెబ్రెటీ ఇంటి వద్ద పోలీసు భద్రత పెట్టడం ‘బిగ్ బాస్ 3’ షో విషయంలోనే జరుగుతోంది. ఈ షో ఇంకా ప్రారంభం కాకుండానే ఈషోలో మితిమీరిన అడల్ట్ కంటెంట్ ఉండబోతోంది అంటూ వస్తున్న వార్తలకు స్పందించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు ‘బిగ్ బాస్ 3’ బ్యాన్ చేయాలి అంటు నాగార్జున ఇంటిని ఈరోజు చుట్టుముడుతాము అని పిలుపును ఇచ్చిన నేపధ్యంలో నాగార్జున ఇంటి చుట్టూ అధిక సంఖ్యలో పోలీసు ఫోర్స్ ను సెక్యూరిటీగా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ‘బిగ్ బాస్ 3’ షోలో ప్రసారం చేసే అంశాలు ముందుగా సెన్సారింగ్ చేయాలి అంటు మహిళా సంఘాల నుండి కూడ విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనితో ‘బిగ్ బాస్ 3’ షో అసలు సజావుగా జరుగుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు రేపు ఈషో విషయమై తమ అభ్యంతరాలు తెలియచేస్తూ కొందరు రేపు సుప్రీమ్ కోర్టులో పిల్ కూడ వేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో జాతీయ స్థాయిలో ‘బిగ్ బాస్’ షోను నిషేదించమని ఉద్యమం ఉవ్వెత్తున జరగబోతోంది.

అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా నాగార్జున ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. సాధారణ వ్యక్తి కూడ సమాజంలో జరుగుతున్న విషయాల పై స్పందిస్తున్న పరిస్థుతులలో ఒక సెలెబ్రెటీ హోదాలో ఉన్న నాగార్జున తాను హోస్ట్ చేసే షో విషయంలో జరుగుతున్న అవకతవకల పై కనీసం స్పందించకపోవడం మరింత అందరిని గందరగోళంలో పడేస్తోంది. మరి చివరకు నాగార్జున ఏమి చేస్తాడో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: