ఇస్మార్ట్ శంకర్ కు వస్తున్న రెస్పాన్స్, ఓపెనింగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూరి సినిమాకు ఇలా ఓపెనింగ్ వుంటుందని ఇండస్ట్రీ ఊహించలేదు. అంతెందుకు ఈ సినిమాను కొనడానికి జనాలు ముందుకు వచ్చారు కానీ రేటు పెట్టడానికి రాలేదు. ఆఖరికి రీజనబుల్ రేట్లకు అమ్మేసారు. అది వేరే సంగతి. ఓపెనింగ్స్ చూసాక నైజాంలో లీడ్ బయ్యర్లు, నాలుక కరచుకుంటున్నారు, వదిలేసామే అని.


సినిమా ఎలా వుంటుంది? మార్నింగ్ షో పడిన తరువాత ఎలా వుంటుంది? అన్న సంగతులు పక్కనపెడితే ఓపెనింగ్స్ కనిపించడమే అద్భుతంగా ఫీలవుతున్నారు సినిమా జనాలు. ఎందుకంటే ఇటీవల కాలంలో హీరో రామ్ కు సరైన సినిమా లేదు. సరైన ఓపెనింగ్ లేదు. పూరి జగన్నాధ్ సంగతి తెలిసిందే. తను బ్యాడ్ ఫేజ్ లో వున్నానని ఆయనే చెబుతారు మొహమాట పడకుండా. ఇక హీరోయిన్లు నభానటేష్, నిధి అగర్వాల్ పెద్ద సూపర్ హీరోయిన్లేమీ కాదు. వారి ఖాతాలో కూడా హిట్ లు ఏమీలేవు. మరి ఎలా సాధ్యమైంది ఈ బజ్, హడావుడి, ఓపెనింగ్.

అయితే దీనికి కారణాలు కూడా చెప్పుకోవచ్చు.  ఒకటి పక్కా మాస్ మసాలా సినిమా కోసం ఆ తరహా సినిమాలు చూసే జనాలు మొహం వాచిపోయి వున్నారు. మజిలీ, జెర్సీ, చిత్రలహరి, మహర్షి లాంటి సైలంట్ గా చూసే క్లాస్ సినిమాలు తప్ప, ఈలలు, పేపర్లు ఎగరేయడాల వంటి వ్యవహారాలు ఈ ఏడాది ఇప్పటివరకు కనిపించలేదు. అమ్మాయిల వంటిపై ఎంత తక్కువ దుస్తులు వుండాలో అంతే వుంచి, ఎంత ఎక్కువ చూపించాలో అంతా చూపించి, హీరో భుజాల మీద, గుండెల మీద, ఇలా ఎక్కడపడితే అక్కడ అమ్మాయిని ఎక్కించేసిన సినిమా స్టిల్స్ ఇటీవల కనిపించలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: