టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో త్వరలో సినిమా సెట్స్ మీదికి వెళ్తున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే సినిమా కథ చిరు విన్నారు.. త్వరలోనే షూటింగ్ కూడా షురూ కానుంది..? ఈ క్రమంలో అసలు ఈ సినిమా యాక్షనా లేకుంటే సోషల్ మెసేజా..? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న.


ఇప్పటి వరకూ కొరటాల తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు సోషల్ మెసేజ్‌కు సంబంధించినవే. ఇందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబును ఎక్కడికో తీసుకెళ్లిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాలే చక్కటి ఉదాహరణ. అయితే చిరు సినిమాలో ఏం సందేశం ఇవ్వబోతున్నారు..? అనేది తలలు పట్టుకుంటున్నా అంతుపట్టడం లేదు.


ఈ సినిమాలో ఎక్కువగా దేశ భక్తి గురించే ఉంటుందని.. ఒక ఇండియన్‌గా చిరు.. దేశం సత్తాను ప్రపంచానికి చాటిచెబుతారట. అలా దేశ భక్తి అనేది ఈ సినిమాకు మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. చిరు-కొరటాల కాంబోలో తెరకక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. కాగా.. ‘సైరా’తో చిరు త్వరలోనే అభిమానుల ముందుకు రానున్న విషయం విదితమే.


మరింత సమాచారం తెలుసుకోండి: