కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో విజయ్ దేవరకొండ మీడియా వర్గాలతో మాట్లాడుతూ తనకు ‘కబీర్ సింగ్’ మూవీ చూసే ఉద్దేశ్యం లేదు అంటూ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు జాతీయ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. ఒక ప్రామిసింగ్ హీరో మరో హీరో నటించిన మూవీ ఘనవిజయం సాధిస్తే సహృదయంతో స్వాగతించాలి కాని ఇలా ఈర్ష్యతో కామెంట్స్ చేయకూడదు అంటూ ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ టోటల్ రన్ లో 35కోట్ల నెట్ కలక్షన్స్ తెచ్చుకుంటే ఈమూవీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కేవలం 26రోజులలో 263కోట్ల కలక్షన్స్ తెచ్చుకున్న విషయం విజయ్ కు తెలియదా అంటూ ఆపత్రిక తన కథనంలో ప్రశ్నలు వేస్తోంది. దీనికితోడు తనకు హీరోగా ఒక సెలెబ్రెటీ హోదాను ఇచ్చిన దర్శకుడు సందీప్ వంగా పట్ల కృతజ్ఞతతో అయినా విజయ్ కబీర్ సింగ్ మూవీని చూసి తన అభిప్రాయం తెలిపి ఉంటే బాగుండేది అంటూ ఆపత్రిక అభిప్రాయ పడింది.

అంతేకాదు విజయ్ భవిష్యత్ ఆలోచనలు బాలీవుడ్ పై కూడ ఉన్న నేపధ్యంలో ఇలామరో బాలీవుడ్ సినిమా ఘనవిజయాన్ని స్వాగతించకపోతే అతడి వ్యక్తిత్వం పై బాలీవుడ్ మీడియాకు సందేహాలు ఏర్పడతాయి అని కూడ ఆపత్రిక కామెంట్స్ చేసింది. ఏవిషయంలో అయినా చాల నిర్మొహమాటంగా మాట్లాడుతాను అని చెప్పే విజయ్ ఒకచిన్న విషయంలో తన జలసీని బయటపెట్టుకుని అనవసరంగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేసుకున్నాడు అంటూ ఆకతనంలో విజయ్ దేవరకొండ పై చురకలు వేసారు.

అయితే బాలీవుడ్ మీడియా విజయ్ పై చేస్తున్న ఈనెగిటివ్ దాడిని ఖండిస్తూ హరీష్ శంకర్ తన అభిప్రాయం వెల్లడించాడు. చిన్ననటుడు స్థాయి నుండి ఒక టాప్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండకు జలసీ ఉంది అంటూ బాలీవుడ్ ప్రచారం చేయడం తగదు అనీ కేవలం ‘కబీర్ సింగ్’ సినిమాను చూడనంత మాత్రాన విజయ్ ఈర్ష్య పడ్డాడు అంటు ఎలాగ నిర్ధారణకు వచ్చారు అంటూ ప్రశ్నలు వేస్తున్నాడు. అదేవిధంగా మరో టాలీవుడ్ మణిశంకర్ ఈవివాదం పై స్పందిస్తూ విజయ్ తాను చేసే ప్రతిపనిలోనూ నిజయితీగా వ్యవహరిస్తాడని అయితే కేవలం యధాలోపంగా విజయ్ చేసిన ఒకచిన్న కామెంట్ ను ఆసరాగా చేసుకుని విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బాలీవుడ్ మీడియా కథనాలు రాయడం దురదృష్టం అంటు అభిప్రాయపడుతున్నాడు. దీనితో విజయ్ జలసీ పై వచ్చిన ఈషాకింగ్ కథనం ఈరోజు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: