`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా, అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `గుణ 369`.  స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ టీజర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు చిత్ర యుని సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ .. కార్తికేయ పేరు కంటే కూడా ఆర్ ఎక్స్ 100 హీరోగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనిలో మంచి తపన ఉంది. టీజర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు అర్జున్ కడియాల నాకు సరైనోడు సినిమా అప్పుడు తెలుసు. చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న దర్శకుడు. తప్పకుండా గుణ మంచి హిట్ వీళ్లకు అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ .. నాకు కార్తికేయ నటన బాగా నచ్చింది. ఆర్ ఎక్స్ 100 హీరోగానే పిలుస్తాను. నటన పరంగా చాలా ఈజ్ ఉన్న హీరో కార్తికేయ. అర్జున్ జంధ్యాల నా దగ్గర భద్ర సినిమా నుండి పనిచేస్తున్నాడు. ఏదైనా పని చెబితే దాన్ని చేసే వరకు అక్కడినుండి కదలడు చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. గుణ సినిమా గురించి నాకు తెలుసు. తప్పకుండా ఈ సినిమాతో అటు కార్తికేయకు ఇటు అర్జున్ కు మంచి పేరొస్తుంది అన్నారు. 

హీరో కార్తికేయ మాట్లాడుతూ .. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో హీరో అనేకంటే మన పక్కింటి అబ్బయ్యి అన్న తరహాలో పాత్రలు ఉంటాయి. అలాగే హీరోయిన్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. నిజజీవితాలకు దగ్గరగా ఉన్న కథ. ఇందులో నేను బాగా నటించానని మా టీమ్ అంటున్నారు. నాకు సినిమా ఇష్టం. దానికోసం ఏదైనా చేస్తా. ఈ సినిమాతో నాకు మంచి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తీ చేసి ఆగస్టు 2న విడుదల చేస్తామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: