తన సినిమాలతో కేలం జనాలను అలరించడమే కాదు..వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం తెలిసిన గొప్ప మనసున్న హీరో రాఘవ లారెన్స్.  కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత దర్శకుడు, నటుడుగా మారాడు.  ముని లాంటి హర్రర్, కామెడీ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన లారెన్స్ ఆ సినిమా సీక్వెల్ గా కాంచన, కాంచన 2, కాంచన 3 తీసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు.  లారెన్స్ సినిమాల్లో హీరో మాత్రమే కాదు నిజజీవితంలో హీరో అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఎక్కడ ఏలాంటి ప్రకృతి ఉపద్రవాలు వచ్చినా..వెంటనే స్పందించిన విరాళాలు ఇవ్వడమే కాదు తన అభిమాన సంఘాలను అక్కడకు పంపి సహాయ కార్యక్రమాలు చేయమని పురిగొలుపుతుంటారు.  ఎంతో మంది అనాధలను చేరదీసి వారికి విద్యాబుద్దలు నేర్పిస్తున్నారు. వృద్దాశ్రమాలకు సహాక సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయించారు.  తాజాగా లారెన్స్ తమ మంచి మనసుతో మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సిద్దమవుతున్నారు.

రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు. దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు.ఈ విషయం మీడియాలో రావడంతో అది లారెన్స్ దృష్టికి వెళ్లింది. 

వెంటనే స్పందించిన లారెన్స్ వారిని ఇంటికి రప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సహాయం కోసం తనను వెతుక్కుంటూ చెన్నై వచ్చారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. ఆ పిల్లాడి సమస్య ఏంటనేది తెలుసుకొని వీలైనంత వరకూ తన ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తానని..లేదంటే ప్రభుత్వం ద్వారా ఆ చిన్నారికి కావలసిన సదుపాయాలు కల్పించేలా చేస్తానని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: