ఈ మద్య కాలంలో స్టార్ హీరోల ఇంట విషాదం నెలకొంటున్న విషయం తెలిసిందే. తాజాగా శివాజీ, అపరిచితుడు, రోబో, రాజా రాణి చిత్రాల్లో నటించిన తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కు మాతృవియోగం కలిగింది.  తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితుడే వివేక్. 

కొంత కాలంగా ఆయన తల్లిగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతోనే చెన్నైలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

వివేక్ తన కుమారుడు ప్రసన్న కుమార్(13)ను కోల్పోయారు. వివేక్ హాస్య నటుడిగా రజనీకాంత్, విజయ్, అజిత్, విశాల్ సహా పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్‌గా అలరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: