తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా బిజీ అయ్యింది.  వరుసగా సినిమాలు చేస్తున్నది.  తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు.  క్షణం, రీసెంట్ గా కల్కి చేసింది.  బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్నది.  


ఈ మూడు సినిమాలతో పాటుగా ది హాలిడే అనే వెబ్ సిరీస్ చేస్తున్నది.  వెబ్ సిరీస్ లో నటించడం చాలా మంచి అనుభవం అని చెప్తున్న ఆదా, ఆ సీరీస్ లో తన రోల్ గురించి సీరీస్ కీ పాయింట్ గురించి మీడియాకు లీక్ చేసింది.  అందులో ఈ అమ్మడు మెహెన్ అనే పాత్ర చేస్తున్నది.  


ఇక పెళ్లి మిందు హాలిడే ట్రిప్ కు వెళ్లడం అనే దాని చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది.  హాలిడే ట్రిప్ కు వెళ్ళడంలో పెద్ద విశేషం ఏముంది.  దాని చుట్టూ వెబ్ సిరీస్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా.  పాయింట్ అందులోనే ఉండొచ్చు.  హాలిడే ట్రిప్ కు వెళ్లిన తరువాత ఏం జరిగిందో తెలియాలి కదా.  


హాలిడే ట్రిప్ కు వెళ్లిన తరువాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో పాపం.  ఒకవేళ దీనిని థ్రిల్లింగ్ గా తీస్తే మంచి త్రిల్లర్ అవుతుంది.  రొమాంటిక్ జానర్ లో తీస్తే హాలిడే ట్రిప్ రొమాంటిక్ గా ఉంటుంది.  అలా కాకుండా హర్రర్ జానర్లో తీస్తే హర్రర్ సీరీస్ అవుతుంది.  కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న స్క్రిప్ట్ ను బట్టి సిరీస్ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: