మరో మూడు రోజుల్లో స్టార్ మా ఛానెళ్ళో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా యుట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మా బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తారని అడుగుతున్నారని బిగ్ బాస్ షో కోఆర్డినేటర్స్ పై ఫిర్యాదు చేసింది. మరో నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ సీజన్2 సెలక్షన్ ప్రాసెస్లో 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అని ప్రశ్నించారని చెప్పింది. గాయత్రి గుప్తా కూడా బిగ్ బాస్ షో గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
బిగ్ బాస్ షోపై ఇలాంటి ఆరోపణలు రావడంతో హోస్ట్ చేస్తున్న నాగార్జున ఇంటివద్ద విద్యార్థి సంఘాలు ధర్నా చేసాయి. నాగార్జున ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించారు.బిగ్ బాస్ షోలో ఆడవారిని కించపరిచేలా వ్యవరిస్తుండటంతో ఈ షో నాగార్జున హోస్ట్ చేయకూడదని, బిగ్ బాస్ షోను నిషేధించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కోర్టులో మాత్రం బిగ్ బాస్ షోకు ఊరట లభించింది. బిగ్ బాస్ షో నిర్వహకుల్ని అరెస్ట్ చేయవద్దని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. 
 
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాకముందే వివాదాలు మొదలవడంతో ఈ షో హోస్ట్ చేస్తున్న నాగార్జున ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హోస్ట్ చేస్తానని కమిట్ అవ్వడం, ప్రోమోలు విడుదల చేయడంతో ఇప్పుడు హోస్ట్ చేయనని చెప్పలేని పరిస్థితి. విద్యార్థి సంఘాలు మాత్రం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరి నాగార్జున బిగ్ బాస్ షో గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: