అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా తన కెరియర్ మొదలుపెట్టి ఆతరువాత టాప్ కొరియో గ్రాఫర్ గా ఎదిగి ఆపై నటుడుగా మారి ఎన్నో విజయాలు అందుకున్న లారెన్స్ కు వేలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తన కన్నతల్లిని విపరీతంగా అభిమానించే లారెన్స్ ఆమె పేరిట పెట్టిన ఒక ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఇండస్ట్రీలోని టాప్ హీరోలు కూడ చేయడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో ఒక మహిళ పట్ల లారెన్స్ చూపించిన సానుభూతి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులోని రాజపాళయంకు చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుక్కి చిత్రమైన వ్యాధి ఉండటంతో  దాన్ని నయం చేసేందుకు అవసరమైన డబ్బులు లేకపోవటంతో లారెన్స్ తనలాంటి వాళ్ళకు సహాయం చేస్తాడని తెలిసి అతడిని కలవడానికి ఆమె చెన్నై వెళ్ళింది. 

అయితే చెన్నై లాంటి మహానగరంలో లారెన్స్ ఉంటున్న ఇంటి అడ్రెస్ తెలుసుకోలేక తాను తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బు ఖర్చు అయిపోవడంతో చెన్నైలో ఆమెను పలకరించే దిక్కు లేకపోవడంతో ఆమె ‘బిచ్చగత్తె’ గా మారింది. అయితే అనుకోకుండా ఆమె వివరాలు తమిళనాడు పోలీసులు ద్వారా లారెన్స్ కు తెలియడంతో లారెన్స్ స్వయంగా ఆమె కోసం తన కారు పంపి తన వద్దకు రప్పించుకున్నాడు.

ఆమె కొడుకుకు వచ్చిన వింత వ్యాది గురించి తెలుసుకుని ఆ అబ్బాయికి చెన్నైలోని ఒక కార్పొరేటు హాస్పటల్ లో తన సొంత ఖర్చు పై వైద్యం చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తిరిగి వారిని వారిఇంటికి పంపేడప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టడమే కాకుండా మందులు కొనుక్కోవడానికి డబ్బులు కూడ యిచ్చి పంపినట్లు తమిళ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఇప్పుడు ఆవిషయానికి సంబంధించిన ఫోటో లీక్ కావడంతో ఆ విషయం సోషల్ మీడియాలో కూడ హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: