ప్రముఖ నటులు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ కొద్దిరోజులుగా ఆస్థి తగాదాలు, కుటుంబ వ్యవహారాలతో ఎన్నో కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో ఆమెపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వనిత తెలుగులో ‘దేవి’సినిమాలో నటించింది.  ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 విశ్వనటుడు కమల్ హాసన్ హూస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.  తమిళ బిగ్ బాస్ 3 లో 18 మంది సెలబ్రిటీలు సభ్యులుగా కలిగిన ఈ గేమ్ షోలో గత 7న నటి ఫాతిమాబాబు బయటకి వచ్చేసింది. 

ఈ బిగ్ బాస్ లో నటి వనితా కూడా ఉన్నారు. కాగా గత ఆదివారం మరో సంచలన నటి వనితా విజయ్ కుమార్ ఎలిమినేట్ అయింది. అయితే వనితా ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  గత కొంత కాలంగా ఆమెపై వస్తున్న కాంట్రవర్సీల కారణంగా బిగ్ బాస్ 3 లో సందడి గా ఉంటుందని తీసుకున్నారు. ఇక వనిత ఉన్నన్ని రోజులు కూడా నిజంగానే ఎన్నో కాంట్రవర్సీలు నడిచాయి.  కానీ ఓటింగ్ విధానంలో ఆమె ఎలిమినేట్ అయింది.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తాను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది.

బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు నాకు చాలా సంతోషం అనిపించిందని..బయటకు కనిపించింనంత కాంట్రవర్సీ ఇంటి సభ్యుల్లో ఉండదని  హౌస్ లో తనకు ఎలాంటి లోటు జరగలేదని తెలిపింది.  బిగ్ బాస్ హౌస్ లో ఆడ, మగ ప్రేమలో పడుతుంటారని తాను కూడా లవ్ లో పడిపోయానని బయట ప్రచారం వచ్చింది. కానీ నేను ముగ్గురు పిల్లల తల్లిని అలాంటి చెత్త నిర్ణయాలు ఎలా తీసుకుంటానని అనుకున్నారో తెలియలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: