ము ము ము ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశ్యం లేదా అనే సాంగ్ గుర్తుంది కదా.  ముద్దు ఇస్తానంటే ఏ అబ్బాయినా ఎందుకు వద్దంటాడు చెప్పండి.  ముద్దుకోసం తహతహలాడే వ్యక్తులు ఎందరో ఉన్నారు.  ఒకప్పుడు ముద్దు సీన్స్ సినిమాలో చూపించేందుకు భయపడిపోయేవారు.

చెట్టు పుట్టలను చూపించి కట్ చేసేవారు.  ఇప్పుడు కాలం మారింది.  దానికి తగ్గట్టుగా అన్ని మారిపోతున్నాయి.  ముద్దు సీన్స్ లో నటించేందుకు హీరోయిన్లు రెడీ అంటున్నారు.  పాపం అప్పటి వరకు అలాంటి సీన్స్ లో చేయని హీరోలు కొంచం తటపటాయిస్తున్నారు.  


పవన్ కళ్యాణ్ తో పులి సినిమాలో హీరోయిన్ గా చేసిన నికిషా పటేల్ ఇప్పుడు తమిళంలో మార్కెట్ రాజా ఎంబిబిఎస్ సినిమా చేస్తున్నది.  ఈ సినిమాలో ఆరవ్ హీరో.  ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయట.  వీటిల్లో నటించేందుకు మొదట ఈ హీరోయిన్ నో చెప్పింది.  


కానీ, కథ డిమాండ్ చేయడంతో చేయక తప్పడం లేదని అంటోంది.  సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తరువాత చేయకూడదు అనే భావన రాకూడదట.  స్క్రిప్ట్ మేరకు చేయాల్సిన ప్రతి సన్నివేశం చేయాలని, అప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంటుందని అంటోంది నికిషా.  


మరింత సమాచారం తెలుసుకోండి: