జయం సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసాడు నితిన్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో సినిమా ఇండస్ట్రీలో నితిన్ కు వరుసగా అవకాశాలొచ్చాయి. జయం సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తరువాత వీరిద్దరి కాంభినేషన్లో ధైర్యం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నితిన్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమా వలనే తనకూ నితిన్ కు మాటల్లేవని తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడూతూ చెప్పాడు. 
 
ధైర్యం సినిమా తీసినపుడే దర్శకుడు తేజ ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఊహించాడట. ఒక డిస్టిబ్యూటర్ తేజను కలిసి తాను జయం సినిమాను కొన్నానని ఇప్పుడు ధైర్యం సినిమాను కూడా కొనబోతున్నానని అన్నాడట. దీనికి సమాధానంగా తేజ " భార్యా పిల్లలు అంతా బాగున్నారా... ఐతే మీ ఇష్టం" అని సమాధానమిచ్చాడట. తేజ అలా కామెంట్ చేయడంతో ఆ డిస్టిబ్యూటర్ ధైర్యం సినిమాను కొనకుండానే వెళ్ళిపోయాడట. 
 
ఈ విషయం తెలిసిన నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తేజపై నిర్మాతల మండలిలో ఫిర్యాధు చేసాడట. డిస్ట్రిబ్యూటర్తో అలా అన్నందుకు నిర్మాతలమండలి తేజకు కోటి రుపాయలు నితిన్ తండ్రికి ఇవ్వాలని చెప్పారట. తేజ ధైర్యం సినిమాకు రెండు కోట్ల పారితోషికం తీసుకుంటే అందులో సగం కోటి రుపాయలు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిగారికి ఇచ్చేసాడట. ఈ గొడవ జరిగినప్పటి నుండి హీరో నితిన్ తో సరిగ్గా మాటలు లేవని తేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: