బిగ్ బాస్ వివాదం ఇప్పుడు నాగార్జున మెడకు చుట్టుకుంది. నాగార్జున బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. మరో వైపు ఓయూ విద్యార్థి సంఘాలు కూడా ఈ షోకు వ్యతిరేకంగా రంగంలోకి దిగాయి.


యువతను చెడుదారి పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ నిర్వాహకుల కార్యాల‌యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు నాగార్జున ఇంటి వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా ఈ వివాదంపై నటి హేమ స్పందించారు. బిగ్ బాస్ షో గురించి జరుగుతున్న గొడవ గురించి నాకు అవగాహన లేదు. బిగ్ బాస్ షోలో ఏదైనా జరుగవచ్చు అనేది వారి క్యాప్షన్.


వారు కేసులు పెట్టిన బిగ్ బాస్ వారు కోర్టులో గెలవ వచ్చు. వారికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే వెళతారు. ఇలాంటి కేసుల వల్ల ఈ షో ఆగదని అనుకుంటున్నాను. దీని గురించి నాకు అవగాహన లేదు కాబట్టి నేను స్పందించాలనుకోవడం లేదని హేమ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ నాగార్జునగారు చాలా పెద్ద మనిషి, చాలా బాధ్యతగల మనిషి, ఆయన మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాస్టింగ్ కౌచ్ లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఉంటే ఆయన ఈ షో చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు? అని హేమ ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: