నేడు హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' రిలీజ్ అయ్యింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న రామ్ మరియు డైరెక్టర్ పూరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో నడుమ మూవీ రిలీజ్ అయ్యింది.


ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీసర్ మంచి  అట్రాక్షన్ ను తీసుకొచ్చాయి. అలాగే కొందరు అభిమానులు చేసిన యానిమేషన్ ట్రెండ్ లో నిలిచింది. రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి ఇందులో ప్రధాన పాత్రలలో కనిపించారు.ఇక ఈ చిత్రానికి మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించగా.పూరి , ఛార్మి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.అయితే చివరికి చిత్రం మంచి సక్సెస్ అయ్యిందా? లేదా?


కధ విషయానికి వస్తే ...హీరో రామ్ ఈ చిత్రంలో శంకర్ గా ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్‌ చేస్తాడు.హీరోయిన్ నభా నటేష్ (చాందిని)తో ఒక డీల్ విషయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది.అదే సమయంలో అనుకోని పరిస్థితులలో శంకర్ ఒక పొలిటీషియన్‌ కాశీరెడ్డిని చంపి జైలుకు వెళ్ళాల్సివస్తుంది. జైలు నుండి తప్పించుకొచ్చిన శంకర్ కు న్యురోసైంటిస్ట్ అయిన పింకీ (నిధి అగర్వాల్‌) ఒక వ్యక్తి జ్ఞాపకాలను శంకర్ మెదడులోకి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంది.అసలు ఎందుకు శంకర్ కు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? అసలు ఆ వ్యక్తి ఎవరు అనేదే ఈ స్టొరీ. తెరపై చూసి ఆనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: