ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం లేకపోతే ఏమీ జరగదు అన్న విషయం కలర్స్ స్వాతిని చూస్తే అర్థమవుతుంది. పిల్ల మాంచి హుషారుంటుంది. చిలిపిగా, అల్లరిగా, అమాయకంగా... రకరకాల షేడ్స్ చూపించి ఆకట్టుకుంటుంది. కానీ మనవాళ్లకు ఆ విషయం అర్థం కావడానికి చాలా కాలమే పట్టింది.

తెలుగువారు ఆదరించకపోయినా తమిళులు నెత్తిన పెట్టుకున్నారు స్వాతిని. అనంతపురం అనే డిఫరెంట్ సినిమాతో ఆమెలోని టాలెంట్ ని బయటికి తీశారు. అప్పుడు తెరచుకున్నాయి మనవాళ్ల కళ్లు. ఓహ్... మన పిల్లకి ఇంత సీన్ ఉందా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. ఆ తర్వాత కొందరు ఆమెకు అవకాశాలివ్వడానికి ముందుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొందరు ఆమెను గుర్తించడం లేదు. అయితే తమిళుల దృష్టిలో మాత్రం స్వాతి మంచి నటి. అందుకే అడపా దడపా పిలిచి ఆఫర్లు ఇస్తుంటారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది స్వాతి. 

సినిమాల సంగతి అలా ఉంచితే, స్వాతి గురించి కోలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వడై కర్రీ చిత్రంలోని తన సహనటుడు జైతో స్వాతి ప్రేమలో పడిందని అక్కడంతా చెప్పుకుంటున్నారు. జై అంటే తెలుసుగా? జర్నీ సినిమాలో అంజలికి జంటగా నటించాడు... ఆ కుర్రాడు! స్వాతికీ అతడికీ మధ్య మేటర్ పరిగెత్తేస్తోందట. వాళ్లకి పెళ్లి కూడా చేసుకునే ఆలోచన కూడా ఉందని, స్వాతి తన పెళ్లిని గురించి తెగ కలలు కంటోందని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో. స్వాతి చెప్పాకే ఏదైనా నమ్మగలం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రోజుకు వంద పుట్టుకొస్తాయి కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: