తానా మహాసభలు పూర్తి అయి రెండు వారాలు అవుతున్నా ఇంకా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరిగి రాకపోవడంతో ప్రస్తుతం పవన్ ఎక్కడ ఉన్నాడు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు పవన్ ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నాడు అని చెపుతుంటే మరికొందరు పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ఆలోచనలు నిమిత్తం ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు అంటూ లీకులు వస్తున్నాయి.

వాస్తవానికి మెగా కాంపౌండ్ కు ప్రస్తుతం పవన్ ఎక్కడ ఉన్నది అన్న విషయమై క్లారిటీ ఉన్నా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ను సంప్రదిస్తున్న వారికి కూడ పవన్ విషయమై స్పష్టమైన క్లారిటీ రావడం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ తన రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తూ తన అభిమానుల కోర్కె తీర్చడానికి ఇంచుమించు తన అభిప్రాయాలను మార్చుకుంటున్నట్లు టాక్. 

అయితే ఈవిషయమై స్పష్టమైన సంకేతాలు ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఒక్క చిరంజీవికి తప్ప మరెవ్వరికీ తెలియదనీ పవన్ ప్రస్తావన ఎవరైనా చిరంజీవి వద్ద చేసినా చిరు నవ్వుతూ టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఎన్నికల ఓటమి తరువాత పవన్ వ్యక్తిగతంగా తన పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ ను కలుస్తానని ఎన్నికల ఫైలితాల తరువాత చెప్పాడు. 

రోజులు గడుస్తున్నప్పటికీ ప్రస్తుతం పవన్ ఎక్కడ ఉన్నాడు అన్న విషయమై క్లారిటీ లేకపోవడంతో పవర్ స్టార్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించాడు అంటు లీకులు మొదలయ్యాయి. ఎన్నికలలో ఓటమి చెందినా ఆవిషయాలను పక్కకు పెట్టి ప్రకాష్ రాజ్ కమలహాసన్ లాంటి టాప్ లెబ్రెటీలు సినిమాలను అదేవిధంగా బుల్లితెర కార్యక్రమాలను ఒస్ట్ చేసే విషయంలో ముందంజలో ఉన్నారు. అయితే పవన్ మాత్రం తనతో సినిమాలు తీసే నిర్మాతలు క్యూ కడుతున్నా అటు రాజకీయాలను ఇటు సినిమాలను ప్వ్డలి ప్రస్తుతం పవన్ ఎక్కడ ఉన్నాడు అంటూ అనేక ఊహాగానాలు సందడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: