ఐశ్వర్య రాజేష్ ఇపుడు టాలీవుడ్, కోలీవుడ్ కి హాట్ ఫేవరేట్. ఈ అమ్మడు చేతిలో ఏకంగా పదకొండు  సినిమాలు ఉన్నాయంటే ఎంత‌టి బిజీ హీరోయినో అర్ధమైపోతుంది. నాలుగు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో నాలుగు చిత్రాలను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా తెలుగులో ‘మిస్ మ్యాచ్’.. తో పాటు ‘కౌసల్య కృష్ణ మూర్తి’.. విజయ్ దేవరకొండ చిత్రాలు కూడా ఉన్నాయి.


ఇదిలా ఉండగా విశ్వ నటుడు కమల్ తో ఐశ్వర్య రాజేష్ జతకట్టిన భారతీయుడు 2 మూవీ అప్పట్లో ఆగిఓయింది. అయితే నిర్మాతలు విధించిన బడ్జెట్ పరిమితుల్లోనే సినిమాను పూర్తి చేసేందుకు శంకర్ అంగీకరించడంతో ఈ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట. ఆగష్టు నుండి బ్రేక్స్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారని టాక్. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అంటే ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలినట్టేనంటున్నారు.


ఇక తెలుగులో కౌసల్యా క్రిష్ణమూర్తి మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ కనుక హిట్ అయితే తెలుగులో కూడా ఈ అమ్మడు వూపుని ఆపడం కష్టమే. అటు అందంతో పాటు అభినయం నిండుగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలిస్తే షాక్ తింటారు. ఆమె ఒకనాటి తెలుగు నటుడు రాజేష్ కూతురు.



మరింత సమాచారం తెలుసుకోండి: