బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు సీను సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు తన పక్కన స్టార్ ఇమేజ్ ఉన్న సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు నటించారు. వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను వంటి స్టార్ డైరెక్టర్లు తనని డైరెక్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు శ్రీను కి ఒక్కటికూడా బారీ హిట్ పడలేదు. అదేంటోగాని వరుసగా సినిమాలు మాత్రం చేసేస్తున్నాడు. అలానే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే రీమేక్ వేరు జిరాక్స్ వేరు. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా ట్రైలర్ చూస్తుంటే, దాని తమిళ మాతృక రాక్షసన్ కు జిరాక్సా? అన్న అనుమానం వస్తోంది. 

సాధారణంగా రీమేక్ లు మెయిన్ ఐడియా, కీలక సన్నివేశాల్లో ఒరిజినల్ సినిమాని యధావిధంగా తెరకెక్కించడం తెలిసిందే, చాలా సినిమాల్లలో చూసిందే. అయితే దర్శకులు, కాస్త తమదైన స్టయిల్, కెమేరా బ్లాక్ లు, డైలాగులు..ప్రేక్షకులకు తెలీకుండా కాస్త మార్చాలని అనుకుంటారు. కానీ రాక్షసుడు తెలుగు సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాత్రం మాతృక రాక్షసన్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ ను పక్కన పెట్టుకుని, అదే విధంగా కెమేరా యాంగిల్స్ దగ్గర నుంచి డైలాగుల వరకు ఫాలో అయిపోయినట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తోందని చాలా మంది అనుకుంటున్నారు.

ఈ జిరాక్స్ సంగతి అలావుంచితే మాతృకలోని థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ ను క్యాచ్ చేయడంలో బాగానే కష్టపడ్డట్లు కనిపిస్తోంది. హీరో బెల్లంకొండ కూడా ఆ పాత్రలోకి మారడంలో బాగానే వర్కవుట్ చేసినట్లు సమాచారం. ఆగస్టు 2న విడుదలయ్యే ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అనుపమ మరమేశ్వరణ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అనుపమకి ఈ ఒక్క సినిమానే చేతిలో ఉంది. ఇక రీసెంట్‌గా ఓ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సంగతి కూడా తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: