పడి పడి లేచే మనసు సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్.. కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'రణరంగం'. ఈ సినిమా రిలీజ్ కు నెలరోజులే టైమ్ ఉండడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. రీసెంట్‌గా టీజర్ ను.. ఫస్ట్ లిరికల్ సాంగ్ 'సీతాకళ్యాణం' ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు 'రణరంగం' టీమ్ రెడీ అవుతోందని ఫ్రెష్ అప్‌డేట్.
 
జూలై 20న సాయంత్రం 04:05 గం. లకు 'కన్నుకొట్టి' అంటూ సాగే పాట ను విడుదల చేస్తామని తెలుపుతూ ఒక అట్రాక్ట్ గా ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు.  'కన్నుకొట్టు'అనగానే  రొమాంటిక్ సాంగ్ అని అర్థం అవుతుందిగా.. అదే విషయం పోస్టర్లో కూడా కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే శర్వానంద్ ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సీన్స్ లోనూ నటించాడని అర్థమవుతోంది. మరి శర్వానంద్ లో ఉన్న ఈ రొమాంటిక్ యాంగిల్ ను డైరెక్టర్ ఎలా చూపించాడో సినిమా రిలీజైయ్యాక తెరపనే చూడాలి.

ఇక 'రణరంగం'లో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడన్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు.  యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో శర్వా నటన సినిమాకే హైలైట్ అవుతుందనే టాక్ బాగానే ఉంది. ఈ సినిమాను ఆగష్టు 15 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.  



మరింత సమాచారం తెలుసుకోండి: