అందాలు ఆరబోసే అవకాశం ఇవ్వాలే కానీ రెజీనా ఒక్క అడుగు కాదు, ఒక్క అంగుళం కూడా వెనక్కు వేయదు. ఈ విషయం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో  రుజువయింది. ఇప్పుడు రాబోతున్న మరో సినిమాలో కూడా రెజీనా అందాలు బాగానే ఆరబోసినట్లు, గ్లామర్‌గా హద్దులు లేకుండా నటించిందని ఆ సినిమాకు అదే పెద్ద అట్రాక్షన్ అవుతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

అడవిశేష్-రెజీనా జంటగా ఎవరు అని హర్రర్ బ్యాగ్డ్రాప్ లో ఒక థ్రిల్లర్ సినిమా రాబోతోంది. పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది. ఈ సినిమాలో రెజీనా చాలా హాటుగా, ఘాటుగా కనిపిస్తుందని సమాచారం. ఇక టాలీవుడ్‌లో ప్రస్తుతానికి రెజీనాకు అవకాశాలు తక్కువే వున్నాయి. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్న రెజీనా తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎవరు ఒక్కటే. టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల హవా బాగా నడుస్తోంది . 

వాళ్ళ పక్కన రెజీనా కాస్త పెద్దగా కనిపిస్తుందనే ఎవరు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంలేనట్లు తెలుస్తోంది. మరి సీనియర్ హీరోలున్నారు కదా..వాళ్ళెవరైనా రెజీనాకు ఛాన్సివ్వొచ్చుగా అని కొంతమంది రెజీనా మీద జాలిపడుతున్నారట. ఇక అడవిశేష్ గూఢచారి తరువాత వస్తున్న సినిమా కావడంతో ఎవరు సినిమాపై కాస్త మంచి ఆశలు వున్నాయి. దీన్ని మంచి రేట్లకు మార్కెట్ చేసారు కూడా. మరి ఈ సినిమా రెజీనాకు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: