క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాను సినిమాల వల్ల నష్టపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘డియర్ కామ్రేడ్’ మూవీని ప్రమోట్ చేస్తూ చెన్నైలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఈ కామెంట్స్ చేసాడు. సినిమాకు సంబంధించిన కథ అవసరాన్ని బట్టి ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వాలనే దర్శకుడి సూచన మేరకు హీరో హీరోయిన్లు కొన్నిసార్లు సినిమాల్లో లిప్ లాక్ చేయవలసి ఉంటుంది అని అంటూ ఆ సీన్లు ఆడియన్స్‌కు వినోదం పెంచినప్పటికీ ఆ సిన్స్ పై వచ్చే విమర్శలు తమ జీవితాలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపెడుతోంది అంటూ కామెంట్స్ చేసాడు. 

ప్రేక్షకుల కోసం తాము లిప్ లాక్ సీన్స్ లో నటిస్తే ఆసీన్స్ చూసి ఎంజాయ్ చేసి ఆతరువాత తమ గురించి హేళనగా మాట్లాడటం తనకు చాల భాదను కలిగిస్తోంది అంటూ కామెంట్ చేసాడు. ఒక సినిమా వెనక ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయని ఆ విషయాలు ఎవరు పట్టించుకోకుండా కేవలం తమను టార్గెట్ చేయడమే పనిగా కొందరు తమ పట్ల ప్రవర్తించడం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నాడు. 

తాము సినిమాను చాల సీరియస్ గా తీసుకుంటామని అంతిమంగా ప్రేక్షకులను మెప్పించడానికి ఇలాంటి సీన్స్ లో నటిస్తాము కాని ఆ సీన్స్ కు తమ వ్యక్తిగత జీవితానికి లింక్ చేయడం అన్యాయం అంటూ విజయ్ ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. సినిమాలను వినోదం గురించి కాకుండా తమ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే విధంగా ఎందుకు చూస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ విజయ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

వాస్తవానికి విజయ్ పడుతున్న ఆవేదనలో నిజం ఉన్నా సినిమా సెలెబ్రెటీలను రాజకీయ నాయకులను స్పోర్ట్స్ స్టార్స్ ను సగటు వ్యక్తి తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావిస్తారు. దీనితో సగటు వ్యక్తి అంచనాలను అందుకోవడంలో వీరు ఏమాత్రం తేడా చేసినా వీరందర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు పెరిగి పోతున్నాయి. ఈ వాస్తవిక విషయాలు విజయ్ దేవరకొండకు తెలియవా అన్నదే ఆశ్చర్యం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: