మరో రెండు రోజుల్లో స్టార్ మా ఛానెళ్ళో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న కత్తి మహేశ్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంటున్న సెలబ్రిటీలు వీరేనంటూ 19 మంది సెలబ్రిటీల లిస్ట్ పెట్టాడు. ఈ 19 మందిలో 14 మందిదాకా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. 
 
పటాస్ షోకు గుడ్ బై చెప్పిన యాంకర్ శ్రీముఖి, వీ6 తీన్మార్ యాంకర్ సావిత్రి, క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ, క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి, వరుణ్ సందేశ్ భార్య వృతిక, హీరోయిన్ మనాలీ రాథోడ్, హీరో వరుణ్ సందేశ్, శతమానం భవతి ఫేమ్ హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ9 ముఖాముఖి జాఫర్, టీవీ5 మూర్తి, కమెడియన్ మహేశ్ విట్టా, రోహిణి, బాబా మాస్టర్, సింగర్ శ్రావణ భార్గవి, రఘు మాస్టర్, సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ, అలీ రియాజ్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. 
 
బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్నట్లు తీన్మార్ సావిత్రి కన్ఫామ్ చేయగా క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఒకవేళ తాను బిగ్ బాస్ షోకు వెళితే మధ్ధతు ఇవ్వాలని చెప్పింది. కత్తి మహేశ్ పెట్టిన లిస్ట్ లో చాలా మంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రేక్షకుల్లో ఈ షో పై ఆసక్తి ఎక్కువయ్యే అవకాశం ఉంది. మరి ఈ లిస్ట్ లో ఉన్న పేర్లు నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు ఆగాల్సిందే. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: