నటన అంటే ఎవరి పద్ధతి వారికి ఉంటుంది. ఒకపుడు నాటకీయ విధానంలో  సినీ తెరపై  నటన ప్రదర్శించేవారు. తరువాత కాలంలో నటన ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది. నటులు సైతం తమ బాడీ లాగ్వేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని తగిన పాత్రలు చేస్తూ వచ్చారు.


ఇక నాచురల్ గా నటించడం కూడా తరువాత రోజుల్లో బాగా పాపులర్ అయింది నటనకు భాష్యం చెప్పే నటులు ఎంతో మంది ఉన్నా కూడా కామెడీ ని కరెక్ట్ టైమింగులో పండించే నటులు తక్కువేనని చెప్పాలి. అటువంటి వారిలో హీరో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఆయన కామెడీనే నమ్ముకుని ఎదిగారు. అంతే కాదు, కామెడీని హీరో స్థాయికి చేర్చారు. రాజేంద్రప్రసాద్ సినిమాలు ఎంతో హాయిగా, ఆరోగ్యప్రదమయిన హాస్యాన్ని ఒలికించాయని చెప్పకతప్పదు.


ప్రధానిగా ఎంతో ఒత్తిడిగా ఉన్న సమయంలో నేనూ రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతానని నాటి ప్రధాని పీవీ నరసిమ్హారావు చెప్పారంటే అంతకంటే రాజేంద్రునికి వేరే అవార్డ్ ఉంటుందా. 90 దశకంలో దేశాన్ని ఏలిన పీవీకి ఓ టానిక్ గా రాజేంద్రుని సినిమాలు పనిచేశాయని చెప్పాలి. ఆయన నటనతో దేశ ప్రధానితో సహా ఎంతో మందికి ఉత్తేజం, ఉత్సాహం కలిగించారు. అద్భుతమైన నటుడు రాజేంద్రుడు. ఈ రొజు ఆయన పుట్టున రోజు.  ఆయన మరిన్ని సినిమాలు చేసి ప్రజలను హాస్య డోలికల్లో వూగించాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: