ఇస్మార్ట్ శంక‌ర్ పూరీ ఈజ్ బ్యాక్ అన్న ప‌దానికి కొంత వ‌ర‌కు న్యాయం చేసింది. ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావ‌డం.. ట్రైల‌ర్‌తోనూ యూత్‌ను ఎట్రాక్ట్ చేయ‌డంతో తొలి రోజు అన్ని థియేట‌ర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో తొలి రోజు వసూళ్లు దుమ్మురేగాయి. హీరో రామ్ కి కూడా చాల కాలం తరువాత మంచి హిట్ దక్కింది అని అంటున్నారు. 


ఈ సినిమాకు తొలి రోజు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇస్మార్ట్ శంకర్ ఏకంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రెండవ స్థాయి హీరో సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడమనేది రికార్డు. అన్నింటికి మించి వ‌రుస ప్లాపుల‌తో ఉండి మార్కెట్ పూర్తిగా ప‌డిపోయిన పూరి, రామ్ కాంబోలో వ‌చ్చిన సినిమాకు ఈ రేంజ్ వ‌సూళ్లు అంటే గొప్ప విష‌య‌మే.


ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇవి... (రూ.కోట్ల‌లో)


నైజాం - 3.43 


సీడెడ్ - 1.20 


వైజాగ్ - 0.86 


ఈస్ట్ - 0.50 


వెస్ట్ - 0.40 


కృష్ణ - 0.53 


గుంటూరు - 0.57 


నెల్లూరు - 0.30 
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 7.83 కోట్లు
--------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: