బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.  ఈ అంచనాలను అందుకునేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నది.  


ఈ సినిమాను ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉన్నా.. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా వాయిదా పడింది.  ఆగష్టు 15 వ తేదీ నుంచి అఫీషియల్ గా ఆగష్టు 30 కు వాయిదా వేశారు.  ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.  


ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశారు.  ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్బ్ గా ఉన్నాయట.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కు సంబంధించిన వర్క్స్ స్పీడ్ అందుకున్నాయి.  


సెకండ్ హాఫ్ ను కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు.  పూర్తి చేసిన తరువాత, సినిమా ట్రైలర్, ఆడియో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  వీలయితే ఆగష్టు 15 వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించాలని యూనిట్ భావిస్తోంది.  అదే రోజున ట్రైలర్ కూడా రిలీజ్ చెయ్యొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: