విలక్షణ నటుడు మోహన్ బాబు లాగే అతడి కుమార్తె మంచు లక్ష్మి కూడ ఏవిషయం పై అయినా చాల నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. దీనికితోడు ఆమె సోషల్ మీడియాలో కూడ చాల యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాల పై స్పందిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఈమధ్య ఒక అమెరికన్ ముందు తల దించుకున్న విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

గత కొద్ది రోజులుగా ఒక అమెరికన్ చాల అనర్గళంగా తెలుగులో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి పేరు రిచర్డ్ ఇసాక్ వాస్తవానికి అతడు న్యూజిలాండ్ వ్యక్తి అయినప్పటికీ అతడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2016 ప్రాంతంలో రెండు సవత్సరాల పాటు అతడు ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో తెలుగు బాగా ఇష్టపడి తాను నేర్చుకున్నాను అని చెపుతున్నాడు.

ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తూ అక్కడి తెలుగు వారితో అనర్గళంగా మాట్లాడుతున్న అతడి మాటలను ఒక వ్యక్తి రికార్డ్ చేసి మంచు లక్ష్మికి షేర్ చేసాడట. ఆ వీడియో చూసి ఆమె షాక్ అవ్వడమే కాకుండా అతడి ముందు తాను తలదించుకున్నాను అంటూ కామెంట్ చేసింది.

దీనికికారణం తాను ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగినా అంత స్పష్టంగా తాను తెలుగు మాట్లాడలేనని అయితే ఆ అమెరికన్ కు తెలుగు భాష పై ఉన్న ముక్కువలో తనకు సగం కూడ లేకపోవడం తనకు అవమానంగా మారింది అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు అనర్గళంగా డైలాగ్స్ చెప్పే మోహన్ బాబు కూతురుగా తాను పుట్టినా ఆ అమెరికన్ కు ఉన్న తెలుగు భాష పై ఉన్న ప్రేమలో తనకు పదవవంతు కూడ లేకపోవడం తన నిర్లక్ష్యంగా భావిస్తున్నాను అంటూ తన పై తానే కామెంట్స్ చేసుకుంది మంచు లక్ష్మి..  


మరింత సమాచారం తెలుసుకోండి: