తమిళ బ్యూటీ అమ‌లాపాల్ ఆమె సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. పూర్తిగా నగ్నంగా నటించిన అమలా పాల్ ఒక్కసారిగా అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈ చిత్ర టీజర్, పోస్టర్స్‌లో అమ్మడు నూలుపోగు లేకుండా కనిపించి పలు వివాదాలకు తెరతీసింది. పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందో ?  లేదో ?  చూద్దాం.


సినిమా క‌థాప‌రంగా చూస్తే కామిని(అమలాపాల్) వెస్ట్రన్ కల్చర్ మైండ్‌సెట్‌తో జీవిస్తుంటుంది. స్నేహితుల‌తో జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసే కామిని ఓ రోజు స్నేహితుల‌తో కలిసి ఫుల్లుగా మందేసిన కామిని ఇంటికి తిరిగిరాలేదు. క‌ట్ చేస్తే ఆమె ఓ పాడుబడ్డ బంగ్లాలో నగ్నంగా ఉంటుంది. అసలు తాను అక్కడికి ఎలా చేరుకుంది..? ఆ రోజు ఏం జరిగింది..? పోలీసులను షాక్‌కు గురిచేసే అంశం ఏమిటి..? చివరకు కామిని ఏమౌతుంది..? అనేది సినిమా కథ.


స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ జనాలకు కిక్ ఇచ్చింది. సినిమా క్రెడిట్ మొత్తం అమ‌ల‌కే ద‌క్కుతుంది. యాక్టింగ్ పరంగా అమలా పాల్ తనలోని నటిని పూర్తిగా చూపించింది. ఎక్కడా ఆడియెన్స్‌ను కళ్లు తిప్పకుండా చేసింది ఈ బ్యూటీ. ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్ స‌స్పెన్స్ క‌థ‌కు మెసేజ్ జ‌త‌చేసి మంచి హిట్ ఇచ్చాడు. అమ‌ల బోల్డ్ ఎంటెంప్ట్‌తో రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ?  ఇప్పుడు ఓవ‌రాల్‌గా మంచి టాక్ సొంతం చేసుకుంది. మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: