సినిమాల పై మోజుతో బాగా చదువుకున్నవారు కూడ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలసార్లు మీడియాలో వచ్చాయి. అయితే ఈసారి ఏకంగా నేషనల్ లెవల్ సెలెబ్రెటీ రాజమౌళి పేరుతో జరిగిన భారీ మోసానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాకు లీక్ అవ్వడంతో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం భాగ్యనగరానికి చెందిన వి. నరేశ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇతడు హైదరాబాద్ కు చెందిన ఒక మహిళా అడ్వకేట్ నుండి రాజమౌళి పేరు చెప్పి చాల తెలివిగా లక్షలలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నరేశ్ కుమార్ ఆ మహిళా అడ్వకేట్ ఫోన్ నెంబర్ టెలిఫోన్ డైరెక్టరీ ద్వారా తెలుసుకుని ఆమెకు ఫోన్ చేసి తనకు తాను ఒకనిర్మాతను అని పరిచయం చేసుకుని తనకు కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి అని చెప్పినట్లు సమాచారం. దీనితో ఆమె ఆ విషయాలను నిజం అనుకుని నమ్మి ఆవ్యక్తిని తన ఆఫీసుకు పిలిచి మాట్లాడటం జరిగినట్లు ఆమీడియా కథనంలో పెర్కొనపడింది. 

నరేశ్ కుమార్ ఆమెతో పరిచయం పెరిగిన తరువాత ఆమెకు సినిమాలలో నటించే ఉద్దేశ్యం ఉందా అని అడిగినట్లు తెలుస్తోంది. దానికి ఆమె వైపు నుంచి పాజిటివ్ సమాధానం రావడంతో ఏకంగా ఈ నరేశ్ కుమార్ రాజమౌళి గొంతుతో ఆమెకు ఫోన్ చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఒక పాత్రను ఆమెకు ఇస్తాను అని నమ్మకం కలిగించే విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆతరువాత ఆమెతో మరింత పరిచయం పెంచుకుని ఈ నరేశ్ కుమార్ రెండు మూడు సార్లుగా గత జనవరి నుండి జూన్ వరకు ఆమె నుండి ‘మా సంస్థ’ సభ్యత్వం అంటూ లక్షలలో తెలివిగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే జరిగిన ఈ మోసాన్ని ఆమె ఆలస్యంగా తెలుసుకుని రంగంలోకి దిగడంతో ప్రస్తుతం నరేశ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు ఆ వార్త కథనం బట్టి తెలుస్తోంది. ఈ వార్తలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఏకంగా రాజమౌళి గొంతుతో జరిగిన మోసం అని తెలియడంతో అందరు షాక్ అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: